HomeTelugu Big Stories'వినరో భాగ్యము విష్ణుకథ': ఓ బంగారం సాంగ్‌ విడుదల

‘వినరో భాగ్యము విష్ణుకథ’: ఓ బంగారం సాంగ్‌ విడుదల

Oh Bangaram Lyrical Song fr

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ . ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, పాటకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఓ బంగారం ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ విడులైంది ‘ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం.. నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్దర్లే మానేసి జాగారం’ అంటూ కిరణ్‌ అబ్బవరం హీరోయిన్‌ను ఫాలో అవుతూ పాడుకుంటున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. సిల్వర్‌ స్క్రీన్‌పై కిరణ్‌ అబ్బవరం, కశ్మీర్‌ పరదేశి కెమెస్ట్రీని మూవీ లవర్స్‌ ఫుల్‌ ఎంజాయ్ చేయడం ఖాయమని సాంగ్‌ విజువల్స్‌ తో అర్థమవుతుంది.

భాస్కరభట్ల రాసిన ఈ పాటను కపిల్ కపిలన్‌ పాడాడు. చేతన్‌ భరద్వాజ్‌ కంపోజ్‌ చేశాడు. కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కశ్మీర పరదేశి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. మురళీ శర్మ, దయానంద్‌ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ శర్మ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్‌టైన్‌ మెంట్‌ అందించనున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu