HomeTelugu Newsఓంకార్, పివిపిసినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న `రాజుగారి గది 2

ఓంకార్, పివిపిసినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న `రాజుగారి గది 2

ఓంకార్, పివిపిసినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న `రాజుగారి గది 2`

ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముక నిర్మాణ సంస్థ బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్  కాంబినేషన్ లో రాజుగారి గది2 రూపొందుతోంది. 2015లో విడుదలైన రాజుగారి గది చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా హర్రర్ కామెడి జోనర్ లో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

ఓంకార్ రాజుగారి గది చిత్రాన్ని వారాహి చలనచిత్రంతో సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా రాజుగారి గది2 చిత్రానికి పివిపి సినిమా బ్యానర్ తోడు కావడంతో కాస్టింగ్ విషయంలో కానీ, టెక్నికల్ పరంగా కానీ సినిమా స్కేల్ పెరిగింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు.

పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్నమెంట్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్ సంయుక్తంగా రాజుగారి గది 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు, నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియజేస్తామని పివిపి సినిమా వర్గాలు తెలియజేశాయి.  

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu