‘ప్రేమమ్’ పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్!

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, శృతిహాసన్ ,మడొన్నా సెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో కార్తికేయ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం ‘ప్రేమమ్’. ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది.

మలయాళంలో ఉస్తాద్ హోటల్, బెంగళూర్ డేస్ వంటి చిత్రాలతో పాటు తెలుగులో భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్  తో పాటు రాజేష్ మురుగేషన్  అందించిన పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా  అక్కినేని జయంతి న విడుదల చేశారు. ఈ పాటలకు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది.

ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ చానెల్ లో ఈ సినిమా లో ని “ఎవరే”  పాట ఒక్కదానికే  ముప్ఫయి లక్షల పైగా వ్యూస్ రావటం విశేషం. ప్రేమకథా చిత్రాలకు అక్కినేని ఫ్యామిలీ అంటే పెట్టింది పేరు. ఏ మాయ చేసావే తర్వాత నాగచైతన్య కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ లవ్ స్టోరీగా నిలవనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. “ఈ సినిమా పాటలను అధికారక యూ ట్యూబ్ చానెల్ తోపాటు ఐ ట్యూన్స్, itunes, saavn,wynk, Eros Now and Hungam ద్వారా వినొచ్చు” అని ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates