HomeTelugu Trendingఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌: 'ఒలే ఒలే పాపాయి' సాంగ్‌ విడుదల

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌: ‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్‌ విడుదల

Ole Ole Paapaayi Dance Promటాలీవుడ్ హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. హీరో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్ర‌మంలో మేకర్స్ ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజ‌ర్‌ ట్రైల‌ర్‌లు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ మాస్‌ సాంగ్ విడుదల చేశారు. ఈ మూవీ నుంచి ‘ఒలే ఒలే పాపాయి’ అంటూ సాగే మాస్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాటను రామ్‌ మిర్యాల, ప్రియ ఆలపించగా.. హ్యారిస్ జ‌య‌రాజ్ సంగీతం అందించాడు.

జానీ మాస్టర్‌ డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాట‌కు సంబంధించి ఫుల్ సాంగ్‌ను డిసెంబ‌ర్ 04న విడుద‌ల చేయ‌నున్నారు. కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ డాక్టర్ రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu