
Chiranjeevi remuneration:
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి.
‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం చిరంజీవి రూ.75 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇన్నేళ్ల కెరియర్ లో చిరంజీవి అందుకోబోతున్న భారీ పే చెక్ ఇదే కావడం విశేషం. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, చిరంజీవికి భారీ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల, నాని సినిమా ‘ప్యారడైస్’ తో బిజీగా ఉన్నారు. 2026 తర్వాత చిరు-శ్రీకాంత్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు, భారీ బడ్జెట్ గురించి టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాకుండా, చిరంజీవి తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా పూర్తి చేయనున్నారు.
ఈ చిత్రం కూడా 2026లోనే థియేటర్స్ లోకి రానుంది. ఈ రెండు సినిమాలు చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి, చిరంజీవి రెమ్యూనరేషన్ తో మాత్రమే కాదు, విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్‌లో మరోసారి తన ప్రభావాన్ని చూపించబోతున్నారు. అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ALSO READ: Game Changer ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే!