HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' : తారక్‌ హీరోయిన్‌ ఈమె

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ : తారక్‌ హీరోయిన్‌ ఈమె

4 18రాజమౌళి నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ సరసన సందడి చేయనున్నది ఎవరో తెలిసిపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలివియా మోరిస్‌ నటించనున్నట్లు చిత్రబృందం ఎట్టకేలకు ప్రకటించింది. అదేవిధంగా ఈ చిత్రంలో రే స్టీవెన్‌సన్‌ విలన్‌ పాత్రలో నటించనున్నట్లు ప్రకటించింది. అలిసన్‌ డూడీ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా వీరి ఫొటోలను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం మొట్టమొదటిసారి టాలీవుడ్‌ టాప్‌ హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమరం భీంగా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియాభట్‌ నటిస్తుండగా, తారక్‌ సరసన మొదట హాలీవుడ్‌ నటి డైసీ ఎడ్గారీ జోన్స్‌ను తీసుకున్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దీంతో ఆప్పటినుంచి ఎన్టీఆర్‌ సరసన ఎవరు నటిస్తారనే విషయంలో అభిమానుల్లో సందేహం నెలకొంది. ఎట్టకేలకు దానిపై ఈరోజు స్పష్టత లభించింది.

4a

Recent Articles English

Gallery

Recent Articles Telugu