‘రాధేశ్యామ్‌’ నుండి ప్రభాస్‌ బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది


టాలీవుడ్‌ యంగ్‌ హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ రోజు ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా నుండి అభిమానులకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్‌ డైరెక్షన్‌లో రూపోందుతున్న అపురూపమైన ప్రేమకథా చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ‘రాధేశ్యామ్‌’. ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని తాజాగా చిత్రబృందం మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో విడుదలైన ఈ పోస్టర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అర‌చేతిలో అద్భుత ప్రపంచాన్ని చూపిస్తూ ప్ర‌భాస్, పూజాల మ‌ధ్య సాగిన రొమాంటిక్ విజువ‌ల్‌ను అద్భుతంగా ఆవిష్క‌రించారు. సంగీతం వినసొంపుగా ఉంది. . యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

CLICK HERE!! For the aha Latest Updates