HomeTelugu Big StoriesOoru Peru Bhairavakona Trailer: గరుడపురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన

Ooru Peru Bhairavakona Trailer: గరుడపురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన

Ooru Peru Bhairavakona movi

Ooru Peru Bhairavakona Trailer: వీఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఫిబ్రవరి 9న ఈ సినిమాలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం చేశారు. దీనిలో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

కన్నులతో చూసేది కొంచెమే..గుండెల్లో లోతే కనిపించెనే..అంటూ హీరోయిన్ అందం గురించే వర్ణించే సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది‌. గరుడపురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన.. భగవంతుడి ఆధీనంలో లేనిది కర్మ సిద్దాంతం.. లిఖించబడ్డదే జరుగుతుంది. రక్తపాతం జరగనీ అంటూ గూస్‌బంప్స్ తెప్పించే సంభాషణలతో సాగుతున్న ట్రైలర్‌ సినిమాపై హైప్‌ని పెంచేలా ఉంది.

ఈ రోజు ఏఎంబీ సినిమాస్‌లోని స్క్రీన్‌ 2లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌ నిజమే నే చెబుతున్నా సోషల్‌ మీడియాలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో దూసుకుపోతుంది.

శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. టైగర్‌ తర్వాత సందీప్‌ కిషన్‌, వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సారి ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న వీఐ ఆనంద్‌ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్‌ చేస్తాడని ఎక్జయిటింగ్‌గా చూస్తున్నారు.

హీరో సందీప్ కిషన్ ఎప్పటి నుండో సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకటి రెండు సినిమాలు తప్ప ఆయనకు పెద్దగా చెప్పకుని సినిమాలు పడలేదు అనే చెప్పాలి. దీంతో సరైన బ్రేక్‌ కోసం చూస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు సందీప్ కిషన్‌.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu