HomeTelugu Big StoriesOoru Peru Bhairavakona: రిలీజ్‌ డేట్ మారింది తప్ప సంకల్పం మారలేదు

Ooru Peru Bhairavakona: రిలీజ్‌ డేట్ మారింది తప్ప సంకల్పం మారలేదు

Ooru Peru Bhairavakona newOoru Peru Bhairavakona: సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ సినిమాలో వర్ష బొలమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. ముందుగా ఈసినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. అయితే ఆ రోజున రవితేజ ‘ఈగల్’ మూవీ విడుదలకానుంది. ఒకే రోజున ఈ రెండు లు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి.

కానీ ఇంతకు ముందే ‘ఈగల్’ మూవీ టీమ్‌ సోలో రిలీజ్‌ డేట్ ఇస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించడంతో.. అదే విషయాన్ని చర్చిస్తూ నిర్మాతల మండలికి లేఖ రాసింది ఈగల్ టీమ్‌. దీంతో ఈ విషయం పై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో చర్చించారు. ఈ క్రమంలోనే ఊరు పేరు భైరవకోన వెనక్కు తగ్గింది.

ఈక్రమంలో ‘ఊరు పేరు భైరవకోన’ 16న రిలీజ్ చేయనున్నట్లు కాసేపటి క్రితం మూవీటీమ్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సందీప్ కిషన్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సందీప్ మంత్రదండం పట్టుకుని కనిపించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu