పూరీ కోసం వెంకీ ఎదురుచూపు!

ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను చూపించలేకపోతున్నాయి. అయినప్పటికీ హీరోల అటెన్షన్ మాత్రం తన వైపు ఉండేలా చూసుకుంటుంటాడు పూరీ. ఆ కోవలోనే బాలయ్య 101వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా గనుక హిట్ అయితే పూరీకి పూర్వ వైభవం రావడం గ్యారంటీ. అయితే ఈ సినిమా రిజల్ట్ తో పట్టింపు లేకుండా పూరీతో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు వెంకటేష్. వీరిద్దరి కాంబినేషన్ లో
సినిమా రాబోతుందని కొంతకాలంగా వార్తలు వినిపించాయి.

కానీ పూరీ, బాలయ్యతో ఛాన్స్ రాగానే వెంకీను పక్కన పెట్టేశాడు. వెంకీ మాత్రం పూరీతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం వెంకీ నటించిన ‘గురు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత వెంకీ, పూరీతోనే సినిమా చేస్తాడట. బాలయ్య సినిమా పూర్తయ్యే వరకు వెంకీ ఎదురుచూడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.