HomeTelugu Trendingఓరి దేవుడా: గ్లింప్స్‌ విడుదల

ఓరి దేవుడా: గ్లింప్స్‌ విడుదల

Ori Devuda Surprise Glimpse
టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వ‌క్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ ఓరి దేవుడా’. మేక‌ర్స్ ఈ సినిమా నుంచి స‌ర్ ప్రైజ్ గ్లింప్స్ ను వీడియో విడుద‌ల చేశారు. తాజాగా విడుద‌ల చేసిన వీడియోలో విక్ట‌రీ వెంక‌టేశ్ కూడా క‌నిపించ‌డం విశేషం. ఈ చిత్రంలో ఆశా భ‌ట్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

కోలీవుడ్ డైరెక్టర్ అశ్వ‌త్ మారిముత్తు త‌మిళంలో తెర‌కెక్కించిన ‘ఓ మై క‌డ‌వులే’ కు తెలుగు రీమేక్‌గా వ‌స్తుంది. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో విజ‌య్ సేతుప‌తి పోషించిన దేవుడి పాత్ర‌లో వెంక‌టేశ్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్ న‌టి మిథిలా పాల్క‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతుంది. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్టోబర్‌ 21న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu