HomeTelugu Trendingదేశంలోనే ఎన్టీఆర్ టాప్ 2... లిస్ట్ నుండి పవన్ అవుట్

దేశంలోనే ఎన్టీఆర్ టాప్ 2… లిస్ట్ నుండి పవన్ అవుట్

JR ntr say sorry fans lette

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఏడాదిలో నిర్దేశిత సమయానికి గాను పలు రంగాలకు చెందిన పాపులర్ స్టార్స్ పై అధ్యయనం చేస్తుంది. దేశవ్యాప్తంగా పోల్స్ నిర్వహించి సర్వేలో పాల్గొన్నవారి అభిప్రాయాల ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయిస్తారు. వెండితెర, బుల్లితెర నటులు, స్పోర్ట్స్ స్టార్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై సర్వే నిర్వహిస్తారు.ఈ క్రమంలో ఏప్రిల్ 2022 వరకు టాప్ పాన్ ఇండియా స్టార్స్ పై నిర్వహించిన సర్వేలో ఎన్టీఆర్ (NTR) రెండవ స్థానం పొందారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాపులారిటీ దేశవ్యాప్తం కాగా ఆయన బెస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. అనూహ్యంగా కోలీవుడ్ స్టార్ విజయ్  ఫస్ట్ ప్లేస్ ఆక్రమించారు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా విజయ్ టాప్ పొజిషన్ అందుకోవడం చెప్పుకోదగ్గ అంశం.ఇక మిగిలిన స్టార్స్  ఏ ప్లేస్ లో ఉన్నారో లుక్ వేయండి ……

3వ స్థానం ప్రభాస్
4వ స్థానం అల్లు అర్జున్
5వ స్థానం అక్షయ్ కుమార్
6వ స్థానం  అజిత్
7వ స్థానం రామ్ చరణ్
8వ స్థానం యష్
9వ స్థానం హీరో సూర్య
10వ స్థానం మహేష్

Ormax Stars India Loves 2022 : Jr NTR Beats Prabhas And Allu Arjun

Recent Articles English

Gallery

Recent Articles Telugu