HomeTelugu News'విజేత' నుండి కో కొక్కొరొకో.. పాట

‘విజేత’ నుండి కో కొక్కొరొకో.. పాట

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా వస్తున్న తొలి సినిమా ‘విజేత’. రాకేశ్‌ శశి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా నాయర్‌ కథానాయిక. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. రజని కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కె.కె. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది.

6 19

ఈ చిత్రంలోని ‘కో కొక్కొరొకో..’అనే పాటను ఈ రోజు విడుదల చేశారు. కోడితో తయారు చేసే వివిధ రకాల వంటల్ని వివరిస్తూ.. దాని త్యాగం గురించి ఇందులో వర్ణించారు. ‘మాకు బలాన్నిచ్చి బలౌతావు శ్రద్ధాంజలి నీకు’ అంటూ సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి ఫన్నీగా లిరిక్స్‌‌ రాశాడు.

ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో మంచి స్పందనే వస్తోంది. ‘మాస్‌ పాట. ఆల్‌ ది బెస్ట్‌ కల్యాణ్‌ దేవ్’, ‘చికెన్‌ ముక్కలతో ఎన్ని రుచులు పుట్టుకొస్తాయో, మన శాస్త్రి గారి లిరిక్స్‌ నుంచి అన్ని రుచులు ఆలకించొచ్చు’, ‘కల్యాణ్‌ దేవ్‌ హిట్‌ కొట్టేలా ఉన్నాడు’, ‘చాలా బాగుంది.. కోడికి సెల్యూట్’ ‘సూపర్‌’.. అంటూ కామెంట్లు చేశారు. త్వరలో ‘విజేత’ ప్రేక్షకుల ముందుకు రానుంది.‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu