HomeTelugu Trending'స్టాండప్‌ రాహుల్‌' నుండి పదా పదమంటోంది సాంగ్‌ విడుదల

‘స్టాండప్‌ రాహుల్‌’ నుండి పదా పదమంటోంది సాంగ్‌ విడుదల

Padhaaa Lyric from Stand Up

రాజ్ తరుణ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘స్టాండప్ రాహుల్’ సినిమా రూపొందింది. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్. శాంటో దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, నందకుమార్ – భరత్ నిర్మాతలుగా వ్యవహరించారు. రాజ్ తరుణ్ జోడీగా వర్ష బొల్లమ్మ నటించింది.

తాజాగా ఈ సినిమా నుండి ‘పదా పదమంటోంది పసిప్రాయం .. సదా నిను చేరేటి ఆరాటం .. ఆగే వీల్లేదు కదా’ అంటూ ఈ పాట విడుదలైంది. శ్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటకి, రెహ్మాన్ సాహిత్యాన్ని అందించగా .. యాసిన్ నజీర్ ఆలపించాడు. హీరో హీరోయిన్‌ల మధ్య చిగురించిన ప్రేమ భావాల నేపథ్యంలో ఈ పాట సాగుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు
తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu