నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా: అనుపమ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్‌గా నటించింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది మూవీయూనిట్‌. అయితే ఈ ప్రమోషన్స్‌కు హీరోయిన్‌ అనుపమ డుమ్మా కొడుతోంది. సడన్‌గా అనుపమ ప్రమోషన్స్‌కు ఎందుకు హ్యాండ్‌ ఇచ్చిందబ్బా? అని నెటిజన్లు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. తాజాగా దీనిపై అనుపమ స్పందించింది.

‘కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్‌కు నేను ఎందుకు రాలేకపోతున్నానో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను మరో రెండు సినిమాల కోసం పగలనకా రాత్రనకా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. ఇతర ఆర్టిస్టులతో కాంబినేషన్‌ సన్నివేశాలను ఎప్పుడో షెడ్యూల్‌ చేశారు. మరోవైపు కార్తికేయ 2 ప్రమోషన్స్‌కు నేను ప్లాన్‌ చేసుకున్నా. కానీ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడటంతో షెడ్యూల్‌ మొత్తం తారుమారైంది. కాబట్టి ఇక్కడ డుమ్మా కొట్టలేని పరిస్థితి. నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. కార్తికేయ 2 టీమ్‌, మరీ ముఖ్యంగా ఎంతగానో కష్టపడుతున్న నిఖిల్‌గారికి నా ప్రేమాభివందనలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చిందీ అనుపమ.

Did she give a counter to Nikhil

CLICK HERE!! For the aha Latest Updates