HomeTelugu Big Storiesప్రభాస్‌ న్యూలుక్‌.. వైరల్‌

ప్రభాస్‌ న్యూలుక్‌.. వైరల్‌

Viral Photo A super stylish and handsome Prabhasపాన్‌ ఇండియా ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, దర్శకుడి మారుతీతో ఓ సినిమా ఇలా అన్నీ పాన్ ఇండియా సినిమాలే భారీ బడ్జెట్ సినిమాలే. వీటిపై భారీ అంచనాలు ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ విడుదలకు రెడీగా ఉంది. మే 9వ తేదీన ఈమూవీ ట్రైలర్ విడుదల కానుంది.

ఈ మూవీ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ సందర్భంగా భారత దేశంలోని పలు ముఖ్యనగరాల్లో ప్రభాస్ సందడి చేయనున్నాడు. మూవీ టీమ్ ఇప్పటికే దానికి సంబంధించి అన్నీ షెడ్యూల్ చేసింది. కాగా ఈ ట్రైలర్ లాంచ్ కి ముందు ప్రభాస్ లుక్ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకు చాలా లావుగా అనిపించిన డార్లింగ్ లుక్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది. ప్రభాస్ బాడీ ట్రాన్సఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ వావ్ అనేస్తున్నారు.

ఆ ఫోటోలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆయన నవ్వుతుండగా ఫోటో క్లిక్ మనిపించినట్లు ఉన్నారు.
ఇదిలా ఉండగా ఆదిపురుష్ ట్రైలర్ ని దాదాపు 70 దేశాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోకి ఏఎంబీ సినిమాస్ లో తొలి ప్రదర్శన జరగనుంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu