రెగ్యులర్‌ షూటింగ్‌లో వినాయక్‌!

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్‌ సెప్టెంబర్‌ 22న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 
ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ”ఈనెల 22న రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేశాం. ఇప్పటివరకు ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ షెడ్యూల్‌ కంటిన్యూ అవుతోంది. సాయిధరమ్‌ తేజ్‌కి ఇది ఓ సెన్సేషనల్‌ మూవీ అవుతుంది. సాయిధరమ్‌, వినాయక్‌ కాంబినేషన్‌లో మా బేనర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం సూపర్‌హిట్‌ అవుతుంది” అన్నారు. 
సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, ప్రియదర్శి, నల్లవేణు, భద్రం, వెంకీ, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌, జె.పి., రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, ఆకుల శివ, ఆశిష్‌ విద్యార్థి, పవిత్ర లోకేష్‌, కాశీ విశ్వనాథ్‌, బ్రహ్మానందం, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.