HomeTelugu Trending'పరంపర' -2 ట్రైలర్‌

‘పరంపర’ -2 ట్రైలర్‌

Parampara 2 web series trai
తెలుగు వెబ్‌ సిరీస్‌లలో ఘన విజయం సాధించిన వాటిలో ‘పరంపర’ ఒకటి. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సిరీస్‌ ప్రేక్షకాదరణ పొందింది. ఈ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘పరంపర సీజన్‌ 2’ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్‌సరీస్‌ సీజన్‌-2 ట్రైలర్ రిలీజ్‌ అయింది. ఈ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ రిలీజ్‌ చేసి, టీమ్‌ అందరికీ బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్‌కు ఎల్‌. కృష్ణ విజయ్‌, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.

నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు జెనరేషన్స్‌కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందగా, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ ఆశాభావం తెలిపింది. పొలిటికల్, రివేంజ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ‘పరంపర 2’ జులై 21 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu