HomeTelugu Trending'డీజే టిల్లు' నుంచి 'పటాసు పిల్లా పటాసు పిల్లా' సాంగ్‌ ప్రోమో

‘డీజే టిల్లు’ నుంచి ‘పటాసు పిల్లా పటాసు పిల్లా’ సాంగ్‌ ప్రోమో

PataasPilla Song Promo from

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డీజే టిల్లు’. ‘అట్లుంటది మనతోని’ అనేది ట్యాగ్ టైన్. సితార ఎంటర్టైన్హెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా శనివారం ‘పటాసు పిల్లా పటాసు పిల్లా’ సాయంత్రం మరో లిరికల్ వీడియో ను విడుదల చేశారు. ఈ పాటని యువ సంగీత సంచలనం అనిరుధ్ ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలోని సన్నివేశాల్లో పాటకు తగ్గట్టే నేహా శెట్టి హీరో సిద్దు జొన్నగడ్డని కవ్విస్తూ పటాస్ పిల్లలాగే కనిపిస్తోంది.

పదాలతో యూత్ ఆకట్టుకునే సన్నివేశాలతో సాగే ఈ ఫుల్ సాంగ్ ని జనవరి 24న విడుదల చేయబోతున్నారు. పాటలతో హల్ చల్ చేస్తున్న `డీజే టిల్లు` రేపు థియేటర్లలో ఏ స్థాయిలో రచ్చ చేస్తుందో చూడాలి అంటున్నారు సినీ జనం. కొత్త తరం ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రిన్స్ బ్రహ్మాజీ ప్రగతి నర్రా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu