HomeTelugu Trendingఆకట్టుకుంటున్న 'ఉస్తాద్‌' న్యూ పోస్టర్‌

ఆకట్టుకుంటున్న ‘ఉస్తాద్‌’ న్యూ పోస్టర్‌

Pawan birthday poster from
ఈ రోజు పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల నుండి వరుస అప్డేట్స్‌ వస్తున్నాయి. అవి ఇప్పటికే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. తాజాగా ఉస్తాద్‌ నుంచి పోస్టర్ రిలీజైంది. చేతిలో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకొని కూర్చున్న పవన్‌ పోస్టర్‌ వీర లెవల్లో ఉంది. పోస్టర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

ఓజీతో పాటు పవన్‌ ఈ సినిమాకు కూడా సమానంగా డేట్స్‌ ఇచ్చి.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తేరీ రీమేక్‌ అంటూ గతంలో ప్రచారం వచ్చినా.. ఎప్పటికప్పుడు ఆ వార్తలను హరీష్‌ శంకర్‌ ఖండిస్తూనే వస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి విడుదల చేయాలి అనుకున్నారు..

ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌ కళ్యాణ్‌ డేట్స్‌ అడ్జెస్ చేయడం కష్టం. దాంతో సినిమాను సమ్మర్‌కు ప్లాన్‌ చేస్తున్నారట. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu