జనసేనాని బస్సు ప్రయాణం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్సులో రంపచోడవరం పయనమయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకొనే దిశగా తన రాజమహేంద్రవరం నుంచి బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం రాజమహేంద్రవరంలో బయల్దేరిన ఆయన గుడాల, కోరుకొండ, గోకవరం మీదుగా రంపచోడవరానికి చేరుకోనున్నారు. ఈ ప్రయాణంలో పలు గ్రామాల్లో గిరిజనులతో పవన్‌ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనంతరం ఈ సాయంత్రం రంపచోడవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ బస్సు ప్రయాణంలో ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు జనసేన నేత, మాజీ మంత్రి బాలరాజు తదితరులు ఉన్నారు.