HomeTelugu Trendingపవన్ క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చిన వర్మ

పవన్ క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చిన వర్మ

3 21

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. తాను కొత్త సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత వర్మ ప్రకటించిన ఈ సినిమాపై అందరూ పోస్టర్ తోనే సరిపెడతాడని అనుకున్నారు. కాని కొన్ని రోజుల క్రితం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా పాటను విడుదల చేసి అందరికి షాకిచ్చాడు.

ఇప్పుడు ఏకంగా వర్మ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది అని పవన్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంటే పవన్ కళ్యాణ్ పాత్ర కూడా వర్మ తన సినిమాలో పెట్టబోతున్నాడని క్లారిటీ వస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమాను చంద్రబాబు నాయుడు మరియు జగన్ మధ్యనే జరుగుతుందని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ను ఎంటర్ చేయడంతో అప్పట్లో చంద్రబాబు నాయుడుకి అండగా ఉన్న పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టాడని వైసీపీ కార్యకర్తలు అనేక ఆరోపణలు చేశారు. వర్మ ఆ విధంగా ఏమైనా ఆలోచించి పవన్ క్యారెక్టర్ తీర్చిదిద్దనున్నాడా అనిపిస్తుంది. వర్మ తలచుకుంటే ఏదైనా చేస్తాడు. అసలు ఏమి చేస్తాడు అన్నదే ప్రశ్నగా ఉండిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu