HomeTelugu Trendingపవన్ కల్యాణ్ తాజాచిత్రం సెట్‌లో ఫొటో లీక్

పవన్ కల్యాణ్ తాజాచిత్రం సెట్‌లో ఫొటో లీక్

Pawan latest Picపవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ షూటింగ్ స్పాట్‌లో ఉన్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. పీఎస్‌పీకే 27 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా 17వ శతాబ్దపు కాలంనాటి కథతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లో సెట్స్‌ వేసి భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పవన్‌ కల్యాణ్ పోరాట యోధుడి గెటప్‌లో ఉన్న ఫొటో చూసి అభిమానులంతా సంతోషిస్తున్నారు. ఎమ్‌ఎమ్‌ రత్నం నిర్మిస్తున్న ఈసినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌లు హీరోయిన్‌లు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu