అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి నో చెప్పిన నాగ్!

అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన మూడవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జొహార్ అఖిల్ ను హిందీ పరిశ్రమకు పరిచయం చేయనున్నాడని కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి నిజమే. కరణ్ జోహార్ అఖిల్ ను హిందీలోకి తీసుకెళదామని అనుకోని నాగార్జునను అడిగాడట.

కానీ నాగార్జున మాత్రం అందుకు ఒప్పుకోలేదట. ముందు అఖిల్ తెలుగు పరిశ్రమలో నిలదొక్కుకోవాలని అప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లోకి పంపే ఆలోచన లేదని, అందుకే కరణ్ జోహార్ కు నో చెప్పానని నాగ్ తెలిపారు. ఇకపోతే అఖిల్ చేస్తున్న ‘మిస్టర్ మజ్ను’ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది.