నరసాపురంలో జనసేన లోక్‌సభ నియోజకవర్గ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు

పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా జనసేన పార్టీ తొలి కమిటీని ప్రకటించింది. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పార్లమెంటరీ కమిటీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా బొమ్మదేవర శ్రీధర్ (బన్ను), కార్యదర్శిగా యిర్రింకి సూర్యారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కనకరాజు సూరి, యర్రా నవీన్, వైస్ చైర్మన్‌గా పోలిశెట్టి వాసు, కోశాధికారిగా పిళ్ళా నారాయణమూర్తి, అధికార ప్రతినిధులుగా చేగొండి సూర్యప్రకాశ రావు, పాదం మూర్తి నాయుడు, అనుకుల రమేష్‌లను నియమించింది. ఇంటలెక్చువల్ కౌన్సిల్, లీగల్ విభాగం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

యువతను కలుపుకుంటూ బొమ్మదేవ శ్రీధర్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జనసేన పార్టీ తెలిపింది. యిర్రింకి సుబ్బారావు వ్యాపారాల్లో విజయాలు సాధించారని ట్విట్లర్లో పేర్కొంది.

జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్‌గా విష్ణు రాజును నియమించారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానంతో ఆయన జనసేనలో చేరారని ఆ పార్టీ పేర్కొంది. ఈ కౌన్సిల్‌లో ఏడుగురు సభ్యులు ఉంటారు. మంగళవారం ఉదయం విష్ణు రాజు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు.