అమీర్ చేయాలనుకునే లోపే అక్షయ్ చేసేశాడు!

అమీర్ చేయాలనుకునే లోపే అక్షయ్ చేసేశాడు!


రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలయిన ‘రుస్తం’ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అక్షయ్ నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. చాలా కాలం తరువాత ఇలియానాకు
బాలీవుడ్ లో ఈ సినిమాతో మంచి హిట్ లభించింది. అయితే నిజానికి ఈ సినిమా అమీర్ చేయాలనుకున్నాడట. 1950లో నేవీ అధికారి కె.ఎం.నానావతి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇదే సంఘటనలతో సినిమా చేయాలని అమీర్ భావించాడట. దీని కోసం రామ్ మాద్వానీని డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకొని అతనితో కలిసి ఈ కథ కోసం లోతుగా పరిశీలన చేశాడట. వీరిద్దరు కలిసి లండన్ లో సెటిల్ అయిన నానావతి భార్యను కూడా కలిసినట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలు సేకరించి సినిమా చేయాలనుకునే సమయంలో నీరజ్ పాండే, అక్షయ్ కుమార్ తో కలిసి ‘రుస్తం’ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారట. దీంతో అమీర్ చాలా బాధ పడ్డాడట. అయితే రుస్తం సినిమాకు తమ కథకు చాలా తేడాలు ఉన్నాయట. మరి ఈ సినిమా చేసే ఆలోచన మానుకుంటాడో…
లేక కొన్ని రోజుల తరువాత చేస్తాడో… చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates