HomeTelugu Newsఅన్నయ్యకు నేను అభిమానినే: పవన్‌ కళ్యాణ్‌

అన్నయ్యకు నేను అభిమానినే: పవన్‌ కళ్యాణ్‌

12 14ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నాకు బయట ఎంతటి పేరైనా ఉండొచ్చు… కానీ, అన్నయ్య దగ్గర మాత్రం నేను ఒక అభిమానినే అన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శక‌త్వంలో.. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్పణ‌లో కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ బ్యాన‌ర్‌పై మెగాపవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా నిర్మిస్తున్న ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన పవన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వేడుకకు నన్ను అతిథిగా పిలిచినందుకు అదృష్టంగా భావిస్తున్నానని.. అభిమానులలో ఒకడిగా, ఒక అభిమానిగా నేను మాట్లాడుతునున్నానని.. అన్నయ్య సినిమా ఫంక్షన్‌కు వచ్చినప్పుడు అభిమానులు అభిమానం ఎలా ఉంటుందో.. ఆ అభిమానంతో మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు.

సినిమా ఇండస్ట్రీలో ఎంత పోటీతత్వం ఉన్నా.. అన్నయ్య సినిమా అంటే మాత్రం అందరూ ప్రేమిస్తారని అన్నారు పవన్ కల్యాణ్.. ఎందుకంటే ఆయన అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అని ప్రశంసించిన ఆయన.. ఇవాళ నాకు ఇంత పేరు వచ్చిందంటే.. అదంతా అన్నయ్య నేర్పిన పాఠాల వల్లే సాధ్యమైందన్నారు. ఇక, ఈ సందర్భంగా మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు పవన్. తెలంగాణలో చాలామంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్న.. ఆ సమయంలో అన్నయ్య నాకు ఇచ్చిన భరోసా ఎప్పటికీ మరిచిపోను.. నువ్వు జీవితంలో గెలవాలి తప్ప.. ఇలా ఎగ్జామ్స్ అనే కొలమానంలో కాదని అన్నయ్య ధైర్యాన్ని చెప్పారని.. ఆ ధైర్యమే ఈ రోజు నన్ను ఇలా మీ ముందు నిలబెట్టిందని.. అన్నయ్య లాంటి వ్యక్తులు చనిపోయిన ఇంటర్ విద్యార్థుల ఇంటిలో ఉండిఉంటే వాళ్ల ప్రాణాలు పోయిఉండేవి కాదని తెలిపారు పవన్. అన్నయ్య దేశం గర్వించే సినిమాలు చేయాలని నేను కోరుకునేవాడినన్న పవన్. నా కోరిక నెరవేరడానికి ఇంతకాలం పట్టిందని. సైరాతో నా కోరిక నెరవేరుతుందన్నారు. ఇక ఈ సినిమా నిర్మిస్తున్న రామ్‌చరణ్‌కు ప్రత్యేకంగా అభినందించారు పవన్ కళ్యాణ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu