తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

ఇంటర్‌ బోర్డు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను సుమోటాగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌కు నోటీసులు పంపింది. 3లక్షల మంది విద్యార్థులు పరీక్ష తప్పడంతో ఆందోళన నెలకొందని వ్యాఖ్యానించిది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.