HomeTelugu Trendingపవన్ కల్యాణ్ బ్రో మూవీ నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్

పవన్ కల్యాణ్ బ్రో మూవీ నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్

Bro movie Rap song
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం సూపర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా రన్ అవుతోంది.

పవన్ వింటేజ్ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మామా అల్లుళ్లు కలిసి నటించిన ఈ సినిమా మొదటిరోజే సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఇటు వీకెండ్స్‏లో ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్స్ రావడం ఖాయమని తెలుస్తోంది.

బ్రో మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. ఇందులో పవన్ మరోసారి దేవుడి పాత్రలో అలరించారు. ఓవైపు బాక్సాఫీస్ వద్ద సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతుండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ర్యాప్ సాంగ్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

యూట్యూబ్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ పాటకు థమన్ సంగీతం అందించాడు. ఆదిత్య అయ్యంగార్ రచించి పాడారు. యూత్ ఆడియన్స్‏కు కనెక్ట్ అయ్యి, బాగా ఎంజాయ్ చేసేలా ఉంది.

వాస్తవానికి ఒరిజినల్ వెర్షన్‏కు సముద్రఖని దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu