HomeTelugu Trendingమేనల్లుడు సినిమాకి క్లాప్‌ కొట్టిన పవన్‌ కల్యాణ్‌

మేనల్లుడు సినిమాకి క్లాప్‌ కొట్టిన పవన్‌ కల్యాణ్‌

2 11
టాలీవుడ్‌ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, ప్రతిరోజు పండగ వంటి సినిమాలతో విజయాలు అందుకున్నాడు. తేజ్ తాజాగా మరో సినిమా చేస్తున్నాడు. ‘ప్రస్థానం’ సినిమాకు దర్శకత్వం వహించిన దేవ కట్టా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మేనల్లుడు కొత్త సినిమాకు వచ్చి క్లాప్ కొట్టాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇంకా ఈ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి హాజరయ్యారు. ఈ సినిమాలో తేజ్ సరసన నివేదా పేతు రాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటి వరుకు తేజ్ చేయని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. గోపీచంద్ తో గౌతమ్‌నంద వంటి హిట్ సినిమా నిర్మించిన భగవాన్ మరియు జె.పుల్లారావు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డిఓపి శ్యామ్‌దత్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా పేరు, సినిమా లోని తారాగణం తదితర వివరాలు తెలియాల్సిఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu