![Nani: టాలివుడ్ కి ఉన్న ఆమిర్ ఖాన్ అతనే అంటున్న నేచురల్ స్టార్ 1 Nani compares Priyadarshi with Aamir Khan](https://www.klapboardpost.com/wp-content/uploads/2024/08/IMG-20240824-WA0000.jpg)
Nani at 35 CKK pre-release event:
తాజాగా విడుదలైన సరిపోదా శనివారం సినిమాతో నాని భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా నాని నిన్న రాత్రి 35-చిన్న కథ కాదు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది.
ఈ ఈవెంట్లో నాని మాట్లాడుతూ, సినిమాలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు చాణక్య వర్మ పాత్రలో నటించిన ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించారు. ప్రియదర్శి విభిన్న పాత్రలను ఎంచుకుంటూ సీరియస్ కంటెంట్‌తో కూడిన పాత్రలను కూడా సమర్ధవంతంగా పోషిస్తున్నారని అన్నారు. ప్రియదర్శి టాలీవుడ్ కి ఉన్న ఆమిర్ ఖాన్ లాంటి నటుడని నాని అనడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రియదర్శి టాలీవుడ్ ఆమిర్ ఖాన్ అయితే 35-చిన్న కథ కాదు తెలుగు సినిమా తారే జమీన్ పర్ తో సమానమని నాని అన్నారు. నంద కిశోర్ ఎమని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి, భగ్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సిద్ధార్థ్ రాళ్ళపల్లి, స్రుజన్ యరబోలు నిర్మించిన ఈ చిత్రానికి, రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.