జగన్‌కు పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌.. మీరు మూడు పెళ్లిల్లు చేసుకోండి

ఇంగ్లీష్ విద్య పవన్‌, జగన్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇసుక సమస్యపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. అనంతరం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాట్లాడితే మూడు పెళ్లిల్లు అంటున్నారని, అవసరమైతే జగన్ కూడా మూడు పెళ్లిల్లు చేసుకోవచ్చని కౌంటర్‌ ఇచ్చారు. ఇంగ్లీష్‌పైన అంతప్రేముంటే.. సుభ్రబాతం కూడా ఇంగ్లీష్‌లోనే చదవించాలని అంతేకానీ విధివిధానాలు లేకుండా ఆంగ్ల విద్యను ప్రవేశపెడ్తామంటే ఎలా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్‌ అండ చూసుకొని వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని విమర్శించారు పవన్. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు.

పరిస్థితి తారుమారైతే ఇబ్బంది పడుతారంటూ హెచ్చరించారు. పవన్ పెళ్లిల్లపై జగన్‌ చేసిన కామెంట్లకు ఘాటుగా సమాధానం ఇచ్చారు జనసేన అధినేత. జగన్‌ మాట్లాడితే మూడు పెళ్లిల్లు చేసుకున్నారని విమర్శిస్తున్నారని, అవసరమైతే ఆయన కూడా పెళ్లిల్లు చేసుకోవచ్చన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు పవన్‌. ఇసుక సమస్యపై మా పోరాటాన్ని వ్యక్తిగతంగా చూడొద్దన్నారు. పాలసీ విధివిధానాలపై ప్రశ్నిస్తే మాపైనే విమర్శలు చేస్తున్నారన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సమస్య మరుగున పడదన్నారు. తన పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు మూడేళ్లపాటు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం రాదనుకున్నానని.. ప్రభుత్వ వైఖరితో నాలుగు నెలలకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు.