100 కోట్ల బడ్జెట్ తో హిరణ్యకశిపుడు!

‘రుద్రమదేవి’ వంటి భారీ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఈ సినిమా తరువాత ‘హిరణ్యకశిపుడు’ అనే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా భక్త ప్రహ్లాద కథే అయినా హిరణ్యకశిపుడికోణంలో సాగుతుంది. ఆ కారణంగానే సినిమాకు టైటిల్ గా ‘హిరణ్యకశిపుడు’ని కన్ఫర్మ్ చేశారు.

ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం రానాను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమాను వంద కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నారు. అయితే రానాను నమ్మి ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం అనేది ఆలోచించాల్సిన విషయమే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేసినా.. 50 నుండి 60 కోట్లు మాత్రమే వర్కవుట్ అవుతుంది. కానీ ఇప్పుడు అంత రిస్క్ తీసుకొని వంద కోట్లు ఖర్చుపెట్టే నిర్మాత ఎవరు దొరుకుతారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది!