HomeTelugu Trendingథియేటర్‌పై పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ రాళ్ళదాడి

థియేటర్‌పై పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ రాళ్ళదాడి

Pawan kalyan fans attack th

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా నేడు.. శ్రీరామ థియేటర్స్‌లో జల్సా సినిమా స్పెషల్‌ షోలు ప్రదర్శించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున పవన్‌ ఫ్యాన్స్‌ సినిమా చూసేందుకు అక్కడికి వచ్చారు. అయితే థియేటర్‌లో సౌండ్‌ సిస్టం సరిగాలేదని అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్‌పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో థియేటర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక ఇదిలా ఉండగా పవన్‌ నేడు 51 వసంతంలోకి అడుడుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా.. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్‌ ‘హరిహరి వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీషూటింగ్‌ దశలో ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu