HomeTelugu Trendingరికార్డ్ ధరకు రామ్ 'స్కంద' ఓటీటీ రైట్స్

రికార్డ్ ధరకు రామ్ ‘స్కంద’ ఓటీటీ రైట్స్

Skanda movie

రామ్ పోతినేని తాజా మూవీ ‘స్కంద’. దీనికి సంబంధించిన డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.

రామ్‌, బోయ‌పాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి మూవీ. వినాయ‌క‌చ‌వ‌తి కానుక‌గా సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కులు రూ.45 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం.

స్కంద శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. రామ్ కెరీర్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా స్కంద నిలిచింది. ఇటీవ‌ల రిలీజైన ఈ మూవీ ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఇప్ప‌టికే యూట్యూబ్‌లో 25 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌ను రాబ‌ట్టింది.

Skanda2

స్కంద మూవీలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్‌. యాక్ష‌న్ మాస్ అంశాల‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడిస్తూ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

స్కంద మూవీతో హీరో రామ్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో ఇంకా శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu