HomeTelugu Trendingపవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' అప్డేట్​

పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్​

Hari Hara veeramallu update

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ‘హరిహరవీరమల్లు’. ఈ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్ ఓ అప్‌డేట్ ఇస్తూ పోస్ట్ చేసింది.

నిధి అగర్వాల్ ఇచ్చిన ఈ సమాచారం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు నిధికి కృతజ్ఞతలు చెప్తూ కామెంట్లు పెడుతున్నారు. నిధి పోస్టును ట్రెండింగ్ చేస్తున్నారు.

తాజాగా పవన్ కల్యాణ్‌తో తన ఇన్‌స్టా ఖాతాలో తొలి పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో నిధి అగర్వాల్‌తో దిగిన ఫొటో కూడా ఉండటం విశేషం. ఈ ఫొటో స్ర్కీన్ షాట్‌ను నిధి అగర్వాల్ పోస్ట్ చేసింది. అది హరిహరవీరమల్లు చిత్రంలోని తొలి సీన్ అని చెప్పింది.

పవన్ కల్యాణ్‌తో కలిసి నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. పవన్‌తో కలిసి నటించాలన్న తన కల నెరవేరిందని ఎమోషనల్ అయింది. ఇలాంటి గొప్ప సినిమాలో నటించడం గర్వంగా ఉందని, అలాగే అద్భుతమైన మూవీటీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరకడం నిజంగా తన అదృష్టం అంటోంది.

అంతే కాకుండా నన్ను నమ్మండి.. మీరు త్వరలోనే థియేటర్లో ఓ అద్భుతాన్ని చూస్తారు అంటోంది నిధి అగర్వాల్. పవన్ కల్యాణ్‌కు, దర్శకుడు క్రిష్‌కు కృతజ్ఞతలు చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu