మహేష్‌బాబు హృదయాన్ని హత్తుకున్న పాట


“మహర్షి” సినిమాలోని “నువ్వని ఇది నీదని.. అనుకున్నావా..” పాట తన హృదయానికి చాలా దగ్గరయిందని.. హీరో మహేశ్‌బాబు అన్నారు. మే 9న విడుదలైన ఈ సినిమా చక్కటి విజయం అందుకుంది. బాక్సాఫీసు దగ్గర విశేషమైన వసూళ్లు రాబట్టడంతోపాటు సందేశాత్మక చిత్రంగా ప్రశంసలు పొందింది. కాగా ఈ సినిమాలోని “నువ్వని ఇది నీదని..” అనే పాటను చిత్ర బృందం ఆడియోతోపాటు విడుదల చేయలేదు. బుధవారం ఈ పాటను ప్రత్యేకంగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీన్ని మహేశ్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. “నువ్వని ఇది నీదని.. నా హృదయానికి బాగా చేరువైన పాట” అని ట్వీట్‌ చేశారు. కార్తిక్‌ ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించారని యూట్యూబ్‌లో నెటిజన్లు కామెంట్లు చేశారు. మే 18న విజయవాడలో ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.