HomeTelugu Trendingటాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ ఎంతో ఇష్టం: ప్రణీత

టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ ఎంతో ఇష్టం: ప్రణీత

3 4

హీరోయిన్‌ ప్రణీత.. ఈమెకు పెద్దగా అవకాశాలు లేకపోయినా పరిశ్రమలో మంచి మనసు ఉన్న అతి కొద్ది మందిలో ఈమె ఒకరు. కరోనా కష్ట కాలంలో తిండి లేక అలమటిస్తున్న వారికి స్వయంగా వంట వండి భోజనం అందించింది. ఈమెది కర్ణాటక అయినప్పటికీ.. టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది. తాజాగా ట్విట్టర్ లో ఆమె తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ పలు ఆస్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చింది బాపుబొమ్మ. తమిళంలో హీరో అజిత్ అంటే తనకు ఎంతో ఇష్టమని… తమిళ భాష తనకు అర్థం కాకపోయినా ఆయన నటించే సినిమాలన్నీ చూస్తుంటానని చెప్పింది.

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రణీత తెలిపింది. ఇతర హీరోల విషయానికి వస్తే… మహేశ్ బాబు అందగాడని, ప్రభాస్ సూపర్ స్టార్ అని, జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్ అని చెప్పింది. డ్యాన్స్ లో ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ ఇద్దరేనని కితాబిచ్చింది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu