HomeTelugu Trendingరాశీఖన్నాను రిజెక్ట్ చేసిన గోపీచంద్‌!

రాశీఖన్నాను రిజెక్ట్ చేసిన గోపీచంద్‌!

Gopichand rejected by Rashi
టాలీవుడ్‌ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘సిటీమార్’. సంపత్ నంది డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో సినిమా కమిట్ అయ్యాడు గోపీచంద్. ‘ప్రతిరోజూ పండగే’ వంటి హిట్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో రాశీఖన్నాను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడు మారుతి. అయితే గోపీచంద్ రాశీఖన్నాను రిజెక్ట్ చేశాడట. గతంలో రాశీఖన్నా కాంబినేషన్ లో తను నటించిన ‘జిల్’ యావరేజ్ అనిపించుకోగా… ‘ఆక్సిజన్’ ప్లాప్ అయింది. అంతే కాకుండా రాశీ ఖన్నా కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు. ‘శ్రీనివాసకళ్యాణం’, ‘అయోగ్య’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలు వరుసగా ప్లాఫ్ అయ్యాయి. మరో వైపు తన కెరీర్ కూడా ప్లాఫ్ లలోనే ఉంది. దీంతో కొత్త హీరోయిన్ అయినా పర్వాలేదంటున్నాడట. దీంతో హీరోయిన్ వెతుకులాటలో పడింది మారుతి టీమ్. చూడాలి మరి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవర్నీ ఎంపిక చేస్తారో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu