HomeTelugu Big Storiesపవన్‌ సినిమాకి చరణ్‌ నిర్మాత, జానీ మాస్టర్‌ డైరెక్షన్‌

పవన్‌ సినిమాకి చరణ్‌ నిర్మాత, జానీ మాస్టర్‌ డైరెక్షన్‌

Pawan kalyan movie as jani
టాలీవుడ్‌ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ పలు సినిమాలకు కోరియోగ్రాఫి అందించారు. పవన్‌కు జానీ మాస్టర్‌ పెద్ద అభిమాని‌. ఆయన హీరోగా ఓ సినిమా తీయాలనేది ఆయన చిరకాల కోరికంటూ పలు ఇంటర్య్వూలో చెబుతూ ఉండేవాడు జానీ మాస్టర్‌. అంతేకాదు ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ కథ కూడా రాస్తున్నట్లు చెప్పెవాడు. చెప్పినట్టుగానే జానీ మాస్టర్‌ కథ పూర్తి చేసి పవన్‌ కళ్యాణ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ కథ విన్న పవన్‌.. జానీ దర్శకత్వంలో నటించేందుకు ఓప్పుకున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక పవన్‌ కల్యాణ్‌ తన కథకు ఒకే చెప్పడంతో జానీ మాస్టర్‌ రామ్‌చరణ్‌ను కలిసి ఈ కథ వినిపించడంతో కొణిదెల ప్రొడక్షన్‌లో ఈ సినిమాను నిర్మించేందుకు చెర్రీ కూడా అంగీకరించాడట. అయితే చెర్రీ తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌లో కేవలం తండ్రి భారీ చిత్రాలను మాత్రమే నిర్మించిన చెర్రీ ఇప్పడు బాబాయ్‌ సినిమాను కూడా నిర్మించడానికి జానీతో జతకట్టినట్టు తెలుస్తోంది. దీంతో జానీ దర్శకత్వంలో బాబాయ్ హీరోగా చరణ్ ఈ సినిమా నిర్మించడం దాదాపు ఖరారు అయినట్టు కూడా టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్త వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu