HomeTelugu Trendingరమేశ్ వర్మతో పవన్‌ కళ్యాణ్‌!

రమేశ్ వర్మతో పవన్‌ కళ్యాణ్‌!

Pawan kalyan movie with Ram

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరువాత నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టడం ఇదే మొదటిసారి. పైగా అన్నీ పెద్ద ప్రాజెక్టులే కావడం విశేషం. ఈ నేపథ్యంలో మరో దర్శకుడికి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వారితో .. రమేశ్ వర్మ ఒకరు. పవన్ కల్యాణ్ తో నిర్మాత బండ్ల గణేశ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి కాంబినేషన్లో పెద్ద సినిమాలే వచ్చాయి. అయితే పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయనతో మరో ప్రాజెక్టును సెట్ చేయడానికి బండ్ల గణేశ్ ప్రయత్నిస్తున్నాడు. రమేశ్ వర్మ దగ్గర మంచి కథ ఉందని తెలిసిన బండ్ల గణేశ్, ఆయనను వెంటబెట్టుకుని వెళ్లాడట. ఆయన వినిపించిన కథ నచ్చడంతో, పవన్ ఓకే చెప్పారని అంటున్నారు. అయితే హరీశ్ శంకర్ .. సురేందర్ రెడ్డి ప్రాజెక్టులు పూర్తయిన తరువాతనే ఈ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ సినిమాతో రమేశ్ వర్మ బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu