HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ న్యూలుక్‌.. వైరల్‌

పవన్‌ కళ్యాణ్‌ న్యూలుక్‌.. వైరల్‌

pawan kalyan new look viral

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహరవీరమల్లు’. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా చిత్రీకరణ ప్లానింగ్ ప్రకారం జరగడం లేదు. దీంతో పవన్‌ కళ్యాణ్‌ షెడ్యూల్ ని బట్టి గ్యాప్ ఇచ్చుకుంటూ తెరకెక్కించాల్సి వస్తోంది.

గత రెండు నెలలు గా షూటింగ్ కి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా వ్యక్తిగత పనుల మీద అమెరికా టూర్ వెళ్లడంతో మరింత ఆలస్యమవుతోంది. తాజాగా ఆయన USA నుండి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. తిరిగి యాధవిధిగా షూటింగ్ కి సమయాత్తం అవుతున్నారు. దీనిలో భాగంగా షూట్ కి సంబంధించి వర్క్ షాప్స్ చేయాల్సి రావడంతో ఆ పనుల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా పవన్ న్యూ లుక్ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అందులో పవన్ రెడ్ కలర్ టీషర్ట్…బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్.. కాళ్లకి వైట్ షూస్ ధరించి న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు. పవన్‌ న్యూలు లో ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తున్నాడు. ఇక వీరమల్లు షూటింగ్ వర్క్ షాప్ అనంతరం తిరిగి పున ప్రారంభం కానుంది. అన్ని పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది మార్చిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈసినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎంఎం కీర‌వాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. 17వ శతాబ్దంలో మొగ‌లుల కాలం నాటి వీర‌మ‌ల్లు జీవిత క‌థతో వ‌స్తున్నఈ చిత్రంలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu