HomeTelugu Trendingహరీశ్ శంకర్‌తో పవన్‌ కల్యాణ్‌ సినిమా

హరీశ్ శంకర్‌తో పవన్‌ కల్యాణ్‌ సినిమా

1
పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలలో పవన్‌ కొత్త సినిమా ఖరారైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. ”గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రానున్న సినిమాను మా బ్యానర్‌లో తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొంది. ఇప్పటికే పవన్‌కల్యాణ్‌- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో త్వరలో ప్రారంభం కాబోయే ఈ సినిమాపై పవర్‌స్టార్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ కొంత కాలంపాటు సినిమాకు బ్రేక్‌ ఇచ్చి రాజకీయాలతో బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ నిర్మాతలుగా వ్యవహరిన్నారు. మరోవైపు డైరెక్టర్‌ క్రిష్‌తో మరో సినిమాలో కూడా పవన్‌ నటిస్తున్నారు. మరోవైపు హారీశ్‌ శంకర్ గతేడాది విడుదలైన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu