HomeTelugu Big StoriesPawan Kalyan OG: రామ్‌ చరణ్‌కు షాక్‌.. పోటీకి దిగిన పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan OG: రామ్‌ చరణ్‌కు షాక్‌.. పోటీకి దిగిన పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan OG is planningPawan Kalyan OG: టాలీవుడ్‌ స్టార్‌ హీరో, జనసేన నాయకుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరో పక్క పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు దగ్గర పడడంతో.. సినిమాలకు దూరంగా ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో ఓజీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా గురించి పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది కూడా అదే తేదీన విడుదలైంది. అత్తారింటికి దారేది భారీ హిట్‌గా నిలిచింది. ఆ రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఓజీకి పనికొస్తుందని పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఓజీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రియాంక మోహన్‌ కథానాయిక గా నటిస్తుంది. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ మరియు వెంకట్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ముందుగా సెప్టెంబర్‌ 27న రామ్‌ చరణ్‌ నటించిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ వస్తుందని భావించారు. నిర్మాత దిల్‌ రాజు కూడా సెప్టెంబర్‌లో వస్తున్నట్టు చెప్పారు. కానీ ఈ డేట్‌కి బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ మూవీని ఫిక్స్ చేశారు. దీంతో రామ్‌చరణ్‌కి ఇది పెద్ద షాక్‌ అని అంటున్నారు నెటిజన్లు.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu