‘ఘట్టమనేని’ ఫ్యామిలీ సినిమా.. మరో మనం అవుతుందా?


టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల ఫ్యామిలీ అందరు కలిసి ఓకే ఫేమ్‌లో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. మన దసరా బుల్లోడు అక్కినేని నాగేశ్వరావు ఫ్యామిలీ హీరోలందరు కలిసి ‘మనం’ సినిమాలో నటించారు. ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, చివర్లో అఖిల్ ఈ సినిమాలో ఒకే స్క్రీన్‌లో కనిపించి అభిమానులకు కనువిందు చేసారు. యాదృశ్చికంగా అక్కినేని వాళ్లింటి కోడలైన సమంత కూడా ‘మనం’ లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఆ తర్వాత మంచు మోహన్ బాబు ఫ్యామిలీ హీరోలు మనోజ్, విష్ణుతో కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ అనే చిత్రంలో కలిసి నటించారు. మంచు లక్ష్మీ గెస్ట్ పాత్రలో మెరిసింది. తాజాగా సూపర్ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా.. ఇలాంటి సినిమానే రాబోతుంది అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.

టాలీవుడ్ సూపర్ స్టార్స్ కృష్ణ, మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార అందరూ ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్‌గా ద్విపాత్రాభినయంలో కనిపించగా.. సూపర్ స్టార్ కృష్ణ కీలక పాత్రలో నటించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో నమ్రత, మహేష్ బాబు పిల్లలు కథకు అనుగుణంగా కనిపించబోతున్నట్టు టాక్‌. మొత్తానికి ఫిల్మ్ సర్కిల్స్‌లో వినపడుతున్నట్టు ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలందరు ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలనుకునే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. నిజంగా ఇటువంటి సినిమా చేస్తే మనం సినిమా మాదిరిగానే ప్రేక్షకుల మదిలో ‘ఘట్టమనేని’ మూడు తరాలు మిగిలిపోతాయి.