HomeTelugu Trending'హరిహర వీరమల్లు' స్పెషల్ పోస్టర్

‘హరిహర వీరమల్లు’ స్పెషల్ పోస్టర్

Pawan kalyan poster from ha

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ ఒక యోధుడిగా కనిపిస్తున్నారు. గుబురు గడ్డంతో, చాలా సీరియస్ లుక్ తో పవన్ ఉన్నారు. ఈ పోస్టర్ ఒక ఫైట్ సీన్ కు సంబంధించినదని తెలుస్తోంది.

క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నికల లోపు ఈ సినిమాను పవన్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణ కలిగిన పవన్ పుట్టినరోజును ఈ సంతోషకమైన రోజున జరుపుకుంటున్నామని ట్వీట్ చేసింది.

20230902fr64f2acfe5d3ed

Recent Articles English

Gallery

Recent Articles Telugu