కేసీఆర్ గారూ దయచేసి మమ్మల్ని వదిలేయండి: పవన్ కల్యాణ్


రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ… తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా… మీ గొడవలు ఉంటే రాష్ట్రాన్ని బలిచేయకండి అని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటికే దెబ్బతిని ఉన్నాం…రాష్ట్రం విడిపోయాక ఎంతో దెబ్బతిని ఉన్నాం. చాలామంది దొడ్డి దారిన ఆంధ్రాకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. కేసీఆర్ గారు రెండు చేతులు జోడించి మీకు రాజమండ్రి సభా వేదికగా విన్నవించుకుంటున్నా అన్నారు పవన్ కల్యాణ్. దయచేసి అందరం బాగుందాం… మీరు అద్భుతమైన నాయకులు… ఇక్కడ మామధ్య ఏవో చిన్నపాటి గొడవలు ఉంటాయి. సర్దుకుని పోతాం. జగన్ మాకు బాగా అర్ధమయ్యే వ్యక్తి. చంద్రబాబుతో కూడా కలిసి పనిచేశాం. మీరు వచ్చి మా మధ్య గొడవలు పెట్టొద్దు. దశాబ్ధాలుగా మీచేత తిట్లుతిన్నాం.. చేతులెత్తి దండం పెడుతున్నా… దయచేసి ఆంధ్రులను వదిలేయాలని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్.