HomeTelugu Trendingఉత్కంఠభరితంగా 'బేతాళ్‌' ట్రైలర్‌

ఉత్కంఠభరితంగా ‘బేతాళ్‌’ ట్రైలర్‌

14 1
బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ఖాన్‌ నిర్మిస్తున్న నెట్‌ఫ్లిక్‌ సిరీస్‌ ‘బేతాళ్‌’. హారర్‌ కథాంశంతో రూపొందించిన ఈ సిరీస్‌లో వినీత్‌ కుమార్‌, అహానా కుమార్‌, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పాట్రిక్‌ గ్రాహం, నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి సిరీస్‌ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. అడవుల్లో నివసిస్తున్న ప్రజల్ని మరోచోటుకి తరలించి, అక్కడ హైవే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తారు. అందుకోసం ఆర్మీ అక్కడి వెళ్లడం.. బేతాళ్‌ కొండల్లో ఉన్న దెయ్యాల్ని ఎదుర్కోవాల్సి రావడం.. దెయ్యాలు ఆర్మీ అధికారుల శరీరాల్లోకి చేరి ప్రాణాలకు హాని చేయడం.. ఈ నేపథ్యంలో రూపొందించిన ట్రైలర్‌ ఉత్కంఠభరితంగా అనిపించింది. మే 24న ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu