HomeTelugu Trendingహరిహర వీరమల్లు గురించి పవన్‌ స్టైలిష్ట్‌ చెప్పిన ఆసక్తికర విషయాలు

హరిహర వీరమల్లు గురించి పవన్‌ స్టైలిష్ట్‌ చెప్పిన ఆసక్తికర విషయాలు

Pawan kalyan stylish about

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన 27వ సినిమా హరిహర వీరమల్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రోజుకో ఓ వార్త సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ కు సంబంధించి చాలా రీసెర్చ్ చేశారట కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య రాజీవ్.

దాదాపు ఈ సినిమాలో పవన్ ముప్పై వరకు వెరైటీ దుస్తులలో కనిపిస్తాడని వినికిడి. అలా పవన్ వేశాధారణ కోసం ఐశ్వర్య దేశవ్యాప్తంగా వెయ్యి టన్నుల ఫాబ్రిక్ ను కొనుగోలు చేసిందట. ఇదివరకు డైరెక్టర్ క్రిష్ తో ఐశ్వర్య కంచె గౌతమిపుత్రశాతకర్ణి సినిమాలకు పనిచేసి అవార్డులు కూడా అందుకుంది. ఈ సినిమా 17వ దశబ్దానికి చెందింది కాబట్టి ఐశ్వర్య కాస్ట్యూమ్స్ విషయంలో ఎంతో రీసెర్చ్ చేసిందట. ఆమె పవన్ కోసం ఆ కాలంనాటి దుస్తులు క్లాత్ కలర్స్ అలంకరణ ఇలా అన్నిట్లో జాగ్రత్త పడుతున్నారట. ఇప్పటికే సినిమా మోషన్ పోస్టర్ గ్లింప్స్ ఏ రేంజిలో వైరల్ అయ్యాయో తెలిసిందే. అలాగే ఈ సినిమాలో పవన్ మూడు పాత్రలలో కనిపించనున్నాడట. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu