HomeTelugu Trendingపవర్ స్టార్ 'ఉస్తాద్' తాజా షెడ్యూల్

పవర్ స్టార్ ‘ఉస్తాద్’ తాజా షెడ్యూల్

Ustad movie update

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరీశ్ శంకర్‌తో పవన్ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్త షెడ్యూల్‌ తాజాగా హైదరాబాద్‌లో మొదలైంది. గబ్బర్ సింగ్‌తో మూవీతో పవన్‌కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించబోతున్నారు. దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి నేతృత్వంలో ఓ భారీ సెట్‌ను రూపొందించారు. ఈ మూవీలో పవన్ సరసన యువ నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి సంబంధించి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో పవన్‌ ఖాకీ డ్రెస్సులో స్టెలిష్‌గా కనిపిస్తున్నారు. అశుతోష్‌ రానా, నవాబ్‌షా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

పవన్ మరో చిత్రం ‘ఓజీ’. దీనికి సంబంధించి తాజాగా రిలీజైన గ్లింప్స్‌ అభిమానులను అలరించాయి. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu